పాలమూరు నుంచి రెండో CMగా రేవంత్ రెడ్డి

-

పాలమూరు నుంచి రెండో CMగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో పాలమూరు నుంచి సీఎం అయిన రెండో వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

Revanth Reddy will vote in Kodangal

గతంలో హైదరాబాద్ స్టేట్ కు కల్వకుర్తికి చెందిన బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పనిచేశారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రాంతం నుంచి రేవంత్ సీఎం పీఠం అధిరోహించారు. కాగా, రేవంత్ స్వస్థలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి.

కాగా, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్‌ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం దిల్లీలో ప్రకటించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఈ నెల 7వ తేదీ గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news