మేము మంజూరు చేసిన పనులకు గెలిచిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టవద్దు !

-

మాజీ మంత్రి జోగురామన్న హాట్‌ కామెంట్స్ చేశారు. మేము మంజూరు చేసిన పనులకు గెలిచిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్ట వద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజల తీర్పును గౌరవిస్తానని..క్యాడర్ అంతా బాధ తో ఉన్నారని చెప్పారు. ఓటమి భాద కలిగించిందని చెప్పారు. ఎంతో అభివృద్ధి చేశాము అయినా ప్రజలు ప్రతిపక్షం లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

jogu ramanna comments viral

మేము చిల్లర మల్లర రాజకీయాలు చేయమని తెలిపారు మాజీ మంత్రి జోగురామన్న.. కక్ష సాధింపు దోరణి లో ఉండ కూడదని కోరారు. ప్రాణం పోయినా కార్యకర్త లను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. యువతను, నిరుద్యోగులను రెచ్చ గొట్టారన్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన పాయల్ శంకర్ కొత్త పనులు తెచ్చినప్పుడే కొబ్బరి కాయలు కొట్టాలని చురకలు అంటించారు మాజీ మంత్రి జోగురామన్న.

Read more RELATED
Recommended to you

Latest news