తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది మంత్రులుగా.. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం గా భట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములు కావాలి.. ప్రజల ఆలోచనను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను.
కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి రాష్ట్రాన్ని సాధించింది. రేపు ఉదయం 10గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు అందరూ హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేవిధంగా తయారు చేస్తానని తెలిపారు. సోనియమ్మ అండతో ఇందిరమ్మ రాజ్యం.. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో.. రాహుల్ గాంధీ సూచనలతో మీకు సేవ చేస్తానని తెలిపారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతతో తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలిపారు.