BREAKING : తెలంగాణ సెక్రటేరియట్ లోకి మీడియాకు అనుమతి నిరాకరణ

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సెక్రటేరియట్ లోకి మీడియాకు అనుమతి నిరాకరించారు సీఎం రేవంత్‌ రెడ్డి. మొదటి రోజు మాత్రమే అందరికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మీడియాను, సందర్శకులను అనుమతించొద్దని పోలీసులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

Denial of media access to Telangana Secretariat

కాగా, అధికారుల బదిలీలు, పోస్టింగులపై కొత్తప్రభుత్వం దృష్టి సారించనుంది. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ మొదటి రోజే తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలకమైన అధికారుల పోస్టింగులపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి శేషాద్రిని నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పోస్టుల్లో పనిచేసిన శేషాద్రి ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news