IND VS RSA : ఇండియాపై గెలుపు..షూ తీసి సౌతాఫ్రికా ప్లేయర్‌ రచ్చ

-

IND VS RSA :  నిన్నటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ సెలబ్రేషన్ వైరల్ అవుతోంది. కీలకంగా సమయంలో సూర్య కుమార్ వికెట్ పడగొట్టిన షంసీ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. షూను తీసి ఫోన్ నొక్కుతున్నట్టు చెవి దగ్గర పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా గతంలో పలువురు ఆటగాళ్లు కూడా ఇదే తరహా సెలబ్రేషన్ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tabraiz Shamsi’s Shoe-Call Celebration After Dismissing Surykumar Yadav Goes Viral

ఇది ఇలా ఉండగా, రెండో టీ20లో భారత్ ను దక్షిణాఫ్రికా ఓడించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తోలుత రింకూసింగ్, సూర్యకుమార్ ల హాఫ్ సెంచరీలతో భారత్ 19.3 ఓవర్లలో 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆపై ఆకస్మాత్తుగా వర్షం రావడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు. ఈ టార్గెట్ ని సఫారీలు ఏడు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు.

Read more RELATED
Recommended to you

Latest news