దాడులు చేయడం పిరికిపంద చర్య : యార్లగడ్డ వెంకట్రావు

-

విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు గన్నవరం టీడీపీ నేత నరసయ్య. నిన్నరాత్రి తన ఇంట్లో పార్కింగ్ చేసి ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం చేశారని ఏడిసీపీ లక్ష్మీపతి కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి గన్నవరం ఇన్ చార్జీ  యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు.

దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు.  నాపై దాడి చేసినా.. కార్యకర్తలపై దాడి చేసినా ఒకేలా స్వీకరిస్తాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు రెండు రోజుల్లో దాడి చేసిన వారిని పట్టుకుంటారని భావిస్తున్నాను. టిడిపికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు.గన్నవరం టిడిపి కంచుకోట అని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి నేత నరసయ్య మాట్లాడుతూ.. నాపై ఎమ్మెల్యే వంశీ కక్షగట్టారని తెలిపారు. ఆయనతోపాటు పార్టీ మారలేదని నన్ను వంశీ టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా, బెదిరించా నేను భయపడను అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news