షకీల్ రైస్ మిల్లుల్లో అక్రమాలు.. 70 కోట్ల విలువైన ధాన్యం మాయం ?

-

బీఆర్‌ఎస్‌ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఊహించని షాక్‌ తగిలింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ధాన్యం బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్నట్లు ఈ ప్రాథమిక విచారణలో వెల్లడి అయింది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుల్లో సుమారు 70 కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు.

యాసంగి, వానా కాలం సీజన్ కు కేటాయించిన కోటా ధాన్యం మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 3.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించాల్సి ఉందని చెబుతున్నారు అధికారులు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లులలో మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు పౌర సరఫరా అధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news