లోకసభలో సున్నాకు పడిపోయిన తెలంగాణ కాంగ్రెస్

-

ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్ సభ ఎన్నికల మీద కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక ఎంపీ సీట్లు సాధించే దిశగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల సంఖ్య సున్నాకు పడిపోయింది.

2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది.నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి,భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి లు ఎంపీలుగా గెలుపొందారు. అయితే 2023 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర నుంచి ఉత్తమకుమార్ రెడ్డి,కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాదించడంతో ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరూ మంత్రులయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. లోక్ సభ స్పీఎకర్ కు రాజీనామా పత్రాలను అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ లోక్ సభ ఎంపీల సంఖ్య జీరో అయింది.ప్రస్తుతం ఎంపీల సంఖ్య లేకపోయినా రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ మందిని గెలుచుకుంటుందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తేల్చింది.

తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎవరికి వస్తాయో తేల్చింది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ సాధిస్తుందని వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుండి 10 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాలలో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ కేడర్లో జోష్ పెరిగింది.అందుకు తగినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను ఆకర్షిస్తు 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ఇప్పటికే మంచి మైలేజీ తెచ్చింది.అలాగే పరిపాలనలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాలను మెప్పిస్తున్నారు.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ లు మూడు నుండి 5 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు టైమ్స్ నౌ తేల్చింది. ఎంఐఎంకు ఒక సీటు గ్యారెంటీ అని చెప్పింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి, ఆయా పార్టీల ఓటింగ్ శాతాలు, ప్రజాభిప్రాయం మేరకు ఈ సర్వే నిర్వహించిన టైమ్స్ నౌ ఈటీజీ తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తేల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news