తెలంగాణలో పలువురు IAS ల బదిలీ

-

సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు పాలకులు, అధికారులు ఆటోమెటిక్ గా మారతుంటారు. ఎవ్వరికీ అనుకూలంగా ఎవ్వరూ ఉంటారో అలాంటి వారినే అధికారులుగా నియమించుకుంటారు.  ఏ అధికారి అయినా వారు చెబితే వినే అధికారిని మాత్రమే ఆయా శాఖల్లో నియమించుకుంటారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్ని శాఖల్లోని ఉన్నతాధికారులు,  అధికారులు మారుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగిన పలువురు అధికారులను వేరే చోటు మార్చారు. అంతకు ముందు అదే పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సహకరించారని కొంతమందిపై వేటు కూడా పడినట్టు సమాచారం. మారిన ఐఏఎస్ అధికారులను పరిశీలించినట్టయితే.. విపత్తు నిర్వాహరణ – అరవింద్ కుమార్, విద్యశాఖ ముఖ్యకార్యదర్శి – బుర్రా వెంకటేశం, మున్సిపల్ శాఖ కార్యదర్శిగా దాన కిషోర్, ఆర్అండ్ బీ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, GAD కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య, ఆరోగ్య శాఖ క్రిస్టినా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టి.కే.శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా ఆర్.వి.కర్ణన్ కొనసాగనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news