పార్లమెంట్ ఘటన తీవ్రమైన సమస్య.. సమగ్ర విచారణకు ఆదేశించాం : ప్రధాని మోడీ

-

ఇటీవల పార్లమెంటు‌లో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొద్ది రోజుల తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. డిసెంబర్ 13 న లోక్‌సభలో జరిగినది “తీవ్రమైన సమస్య” అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో చర్చ లేదా ప్రతిఘటనకు బదులు, పరిష్కారాన్ని కనుగొనడానికి సంఘటనను లోతుగా విచారించాల్సిన అవసరముందని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి దైనిక్ జాగరణతో మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని అన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు.

దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై విచారణ జరుపుతున్నాయని, చొరబాటుదారుల దాడి వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలో కనుగొంటామని ఆయన తెలిపారు. పార్లమెంటులో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. స్పీకర్ సార్ పూర్తి సీరియస్‌గా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు కూడా కఠినంగా విచారణ చేస్తున్నాయి. దీని వెనుక ఉన్న అంశాలు మరియు ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి మేము విషయంలో లోతుగా వెళ్లడం ముఖ్యం. పరిష్కారాలను కూడా ఏకాభిప్రాయంతో వెతకాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి అంశాలపై చర్చకు లేదా ప్రతిఘటనకు దూరంగా ఉండాలని  అని ప్రధాని మోడీ చెప్పినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news