ఉమ్మడి ఉదయ గోదావరి జిల్లాలపై సీఎం జగన్ ఫోకస్.. ఎమ్మెల్యేలతో భేటీలు..

-

వై నాట్ 175 అంటున్న వైసీపీ కీ అందుకు అనుగుణంగానే వ్యూహాలు రచిస్తుంది.. గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలని సర్వేలు చేస్తుంది.. ఈ క్రమంలోనే ఇప్పటికే 11 అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు చేసిన సీఎం జగన్ మరికొందరని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు.. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో మార్పులు చేసిన అనంతరం సీఎం జగన్ ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ చేశారు..

ఒక్కొక్కరిని Cm Ys జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారు.. సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు.. ముఖ్యంగా చింతలపూడి, పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆయనతో భేటీ అవుతున్నారు.. సీఎం జగన్ ఒక్కొక్కరితో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుతున్నారు.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల్ని వారికి వివరించడంతో పాటు నియోజకవర్గాల్లో సర్వే చేసిన అనంతరం వచ్చిన ఫలితాలను వారికి వివరిస్తున్నారు..

వచ్చే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వారికి వివరిస్తున్నారు.. విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈసారి టికెట్లు ఇస్తున్నట్లు.. టిక్కెట్లు ఇవ్వలేని వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇస్తున్నారు.. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులకు స్థానాచల్నం చేశామని వారు సైతం తన నిర్ణయాన్ని అంగీకరించారని mla ల వద్ద cm జగన్ చెబుతున్నారట.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా దొరబాబు కొనసాగుతుండగా.. వచ్చే ఎన్నికల్లో ఆస్థానం నుంచి ఎంపీ వంగా గీతాన్ని బరిలోకి దింపాలని సీఎం జగన్ భావిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఇదే అంశాన్ని దొరబాబుకి తెలియజేసేందుకు సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారట.. వీరందరినీ నచ్చజెప్పి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసిపి అడుగులు వేస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news