కేసీఆర్ టీఆర్ఎస్ ను వద్దనుకున్నారు…ప్రజలు బీఆర్ఎస్ వదిలేశారు – విజయశాంతి

-

కేసీఆర్ టీఆర్ఎస్ ను వద్దనుకున్నారు…ప్రజలు బీఆర్ఎస్ వదిలేశారని ఎద్దేవా చేశారు విజయశాంతి. కేసీఆర్ గారు తెలంగాణ ల టీఆర్ఎస్ వద్దు అని అనుకుని బీఆర్ఎస్ చేసారు….తెలంగాణ ప్రజలు, సమాజం బహుశా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ వద్దు అనుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాలు వచ్చాయని చురకలు అంటించారు.

నాడు కేసీఆర్ గారు ఎన్ని తప్పులు చేస్తున్న కూడా…అప్పటి తెలంగాణ సమాజంల ఒక ప్రయోక్తి ఉండేదని చెప్పారు. “తెలంగాణ అనే శివలింగంపై కూర్చున్న తేలు టీఆర్ఎస్” ఆ పరిస్థితిల తేలుని చెప్పుతో కొట్ట రాదు, ‘చేత్తో ‘తియ్యలేం అని అంటూ పేర్కొన్నారు.

“శివలింగం తెలంగాణ” తెలంగాణా వద్దు‌ టీఆర్ఎస్ వద్దు అనుకున్నది బీఆర్ఎస్ కేసీఆర్ గారు.కానీ ప్రజలు ఆ దుర్మార్గ పాలనను తమ ‘చేతి’ ఓటుతో…కాంగ్రెస్ ‘చేతి’ గుర్తుతో…నేడు తీసేశారని వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ అంటేనే భావి రాజకీయ శూన్యత లేదా భవిష్యత్ రాజకీయం సున్నా అన్నది తెలంగాణ సమాజం నిర్ణయించిన పరిస్థితి నేడు వాస్తవంగా ఉందన్నారు విజయశాంతి

Read more RELATED
Recommended to you

Latest news