తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

ఇరిగేషన్ శాఖలో చాలా దుర్మార్గంగా జరిగింది అన్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పకుండా విచారణ చేస్తామన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే. పాలమూరు రంగారెడ్డి 25వేల కోట్లు ఖర్చు చేస్తే.. కొత్త ఆయకట్టు జీరో అన్నారు. సీతారామ ప్రాజెక్టు పై 7వేల కోట్లు ఖర్చు చేస్తే.. కొత్త ఆయకట్టు జీరో అన్నారు.

మేడిగడ్డ డ్యామేజీ అనేది నెగ్లిజెన్స్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి నిర్లక్ష్యం చూడలేదన్నారు. డిజైన్ చేసింది ప్రభుత్వమే అని నిర్మాణ ఎల్ అండ్ టీ  సంస్థ చెప్పింది. ఎవ్వరి ఎజెండా అని ప్రశ్నిస్తే.. ఇంకా ఎవ్వరూ అన్ని ఆయనే కదా అని ఎల్ అండ్ టీ వాళ్లు అన్నారు. డిజైన్ సరిగ్గా లేదని ఆ సంస్థ చేబుతోంది. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పెద్ద ప్రాజెక్ట్ కానీ ఫలితం లేదు. మన కుటుంబాలను తాకట్టు పెట్టి అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టి ప్రయోజనం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news