మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు…. 146 కి చేరిన సంఖ్య….

-

పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం ఇంకా కొనసాగుతుంది. ఈరోజు ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. కాంగ్రెస్ ఎంపీలు డీకే సురేష్, నకుల్ నాథ్ ,దీపక్ బైజులు పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయబడ్డారు. దీంతో సస్పెన్షన్ వేటుకి గురైన ఎంపీల సంఖ్య 146 కి చేరింది. ఈనెల డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటుపై భద్రత ఇద్దరు యువకులు పార్లమెంటులోకి చొరబడి పసుపు వాయువుని విడుదల చేశారు. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన విడుదల చేయకపోవడంతో లోక్ సభ మరియు రాజ్యసభలోని నాయకులు సభకు ఆటంకాన్ని కలగజేస్తున్నారు. దీంతో స్పీకర్స్ వీరిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈనెల 14వ తేదీన 14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడగా సోమవారం నాడు 78 మందిపై మంగలవారం నాడు 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.

 

దీంతో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఈ సస్పెన్షన్ నిరసిస్తూ పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భద్రత ఉల్లంఘన ఘటనపై మాట్లాడకపోవడం అనేది పార్లమెంట్ హక్కుల్ని ఉల్లంఘించడమేనని అన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news