Team India: రోహిత్‌, కోహ్లీలు కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన క్రికెటర్‌ ఎవరంటే..!

-

టీమిండియాలో ఆటతీరుతోపాటు సంపాదన పరంగా అత్యధికంగా అర్జించే ప్లేయర్స్ లో రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీలు ముందు వరుసలో ఉంటారు. ఐపీఎల్‌ కాంట్రాక్టులు, బ్రాండ్‌ ప్రమోషన్స్‌,మ్యాచ్‌ ఫీజులు వంటి వాటి తో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈసారి మ్యాచ్ ఫీజుల ద్వారా అత్యధికంగా ఆదాయం పొందే వారిలో కోహ్లీ, రోహిత్ కాక టీమిండియా చైనా మెన్ స్పిన్నర్ కుల్డీప్ యాదవ్ చోటు దక్కించుకోవడం విశేషం.

 


కుల్దీప్ యాదవ్ మ్యాచ్లలో తప్ప యాడ్స్ లో నటించడు కదా మరి అంత ఆదాయం ఎలా వస్తుందని అనుకుంటున్నారా… ఇది కేవలం అతడు వన్డేలలో మ్యాచ్ ఫీజుల ద్వారా సంపాదించే ఆదాయం మాత్రమే.
ఈ సంవత్సరం ఇండియా నుంచి వన్డేలు ఆడినవారిలో అత్యధికంగా ఆదాయం పొందిన ప్లేయర్స్ లిస్టులో కుల్‌దీప్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు.

ఈ సంవత్సరం లో కుల్‌దీప్‌.. వన్డే లో 30 మ్యాచ్‌లు ఆడి రూ. 1.80 కోట్లు సంపాదించాడు. వన్డేలలో ఒక్కొక్క ఆటగాడికి భారత్ రూ. 6 లక్షలు చెల్లిస్తుందన్న విషయం తెలసిందే. ఈ సంవత్సరం అందరికంటే ఎక్కువ వన్డేలాడిన కుల్దీప్ 49 వికెట్లు తీశాడు. అయితే ఈ లిస్టులో శుబమాన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news