సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..!

-

వైసీపీలో అభ్యర్థులు ఇద్దరి తీరు అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా టికెట్ దక్కదన్న సమాచారం అందుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అలిగినట్టు సమాచారం. పలువురు పార్టీ మారేందుకు కూడా సిద్ధం అవుతున్నారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ రోజు సీఎం జగన్ సె క్రటేరియట్ నుంచి 3 వేల పించన్ పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే.. కాకినాడ కలెక్టరేట్ లో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.

ఈ వీడియో కార్ఫరెన్స్ లో జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ గీతా పాల్గొన్నారు. అయితే.. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు మాత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదు. దొరబాబుకు పిఠాపురం సీటును సీఎం జగన్ నిరాకరించారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అధికారుల నుంచి సమాచారం వచ్చినా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించలేదని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ఈ కాన్ఫరెన్స్ కు హాజరుకాకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news