తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అందులో రెండు హామీలను అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు అభయహస్తం పేరిట ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం కింద దరఖాస్తులు స్వీకరిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొదటి రోజే ఏకంగా 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2,050 పంచాయతీలుయయ పట్టణాలు, నగరాల్లోని 2,010 వార్డుల్లో జరిగిన ఈ సదస్సుల్లో 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 2 లక్షల 88 వేల 711 దరఖాస్తులు రాగా జీహెచ్ఎంసీలో 10,09,89 రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2 లక్షల 59 వేల 694 దరఖాస్తులు అందాయి .ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని వార్డులు డివిజన్లలో సదస్సులు జరిగాయి. ఉపముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించారు.