కుటుంబంలో చిన్నపాటి గొడవలు సహజం.. భూతద్దంలో చూడద్దు: కేశినేని చిన్ని

-

విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఎంపీగా రాజీనామా చేస్తానని తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళిపోతానని పోస్ట్ లో పెట్టారు త్వరలోనే ఢిల్లీ గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారని తర్వాత మరుక్షణం టిడిపి నుండి రాజీనామా చేస్తానని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మొన్న తిరువూరు సమావేశంలో కూడా కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన పొలిటికల్ వార్ ముదిరిపోయింది.

చంద్రబాబు ఆదేశాల తో టీడీపీ నేతలు కలిశారని తిరువూరు సంబంధించి పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉండమని చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే కేశినేని నాని రాజీనామా ప్రకటన నాకు తెలియదని కేశినేని చిన్ని టిడిపి నేత చెప్పారు. తిరువూరు సభలో ఎంపిక కేశినేని నానికి ఉంటుందని అన్నారు. అలానే, చంద్రబాబు పాల్గొనే రా..! కదలి రా..!! సభ సక్సెస్ అవుతుందన్నారు. బెజవాడ పార్లమెంట్ పరిధిలోని నేతల మధ్య విబేధాల్లేవు. చిన్నపాటి బేధాభిప్రాయాలే భూతద్దంలో చూడొద్దు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news