ముక్కు అవినాష్ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. అవినాష్ జబర్దస్త్ షో ద్వారా అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అవినాష్. ముక్కు అవినాష్ యాంకరింగ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అలానే పలు సినిమాల్లో కూడా నటించాడు. 2001లో అనూజ ని పెళ్లి చేసుకున్నాడు అవినాష్. 2022 ఏప్రిల్ లో భార్య గర్భవతి అని పోస్ట్ పెట్టాడు అవినాష్.
ఇప్పుడు మాత్రం తన బిడ్డని కోల్పోయానని బాధలో ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పటికీ బాధని దిగమింగుకోలేక పోతున్నాను అని ఆవేదనని వ్యక్తపరిచాడు అవినాష్. తన జీవితంలో సంతోషం అయినా బాధ అయినా మీతోనే పంచుకుంటానంటూ పోస్టులో వివరించాడు. తన జీవితంలో జరిగిన విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని కొన్ని కారణాల తో బిడ్డని కోల్పోయానని దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేశాడు. అలానే ఈ విషయం పై ఎటువంటి ప్రశ్నలు అడగవద్దని చెప్పాడు.