వైసీపీ అధికారంలో రాగానే గ్రామ సచివాలయాల పేరిట ఓ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేసి వాటిని సచివాలయాలుగా మార్చారు. అయితే విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న విషయంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ.. భాషా సినిమాలోని రజనీకాంత్ డైలాగును ట్విటర్ లో పోస్ట్ చేశారు. విలన్ కు బదులిస్తూ ఇందులో రజనీకాంత్ ‘అక్కడ చూడు’ అనే ఫేమస్ డైలాగు ఇందులో ఉంది. ఈ వీడియోకు వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న ఫొటోలను జతచేసి ఆయన ట్వీట్ చేశారు.
‘ముందు కలరేశారు, బెడిసి కొట్టి కవర్ చేశారు. అప్పటికైనా మారారా?.. లేదు.. బుద్ధి చూపించుకున్నారు. చివరికి బోర్లా పడ్డారు’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇటీవల అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. మళ్లీ ఆ పార్టీ ఇటువంటి తీరే కనబర్చడంతో విమర్శలు వచ్చాయి. అయితే, ఈ ఫొటో నకిలీదంటూ వైసీపీ చెబుతోంది. దీనిపైనే స్పందిస్తూ లోకేశ్.. ఈ విమర్శలు చేశారు.
ముందు కలరేసారు, బెడిసి కొట్టి కవర్ చేసారు. అప్పటికైనా మారారా.. లేదు బుద్ది చూపించుకున్నారు. చివరికి బోర్లా పడ్డారు. pic.twitter.com/gVa5zdiDoT
— Lokesh Nara (@naralokesh) November 23, 2019