ఇలా మీ ముందుకు రావడం సంతోషంగా వుంది: ప్రధాని మోదీ

-

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ యువత తో మాట్లాడటం జరిగింది యువ శక్తి ప్రాధాన్యత ని గుర్తు చేశారు నరేంద్ర మోడీ. నాసిక్ లోని తపోవనం మైదానం లో జాతీయ యూత్ ఫెస్టివల్లో యువతని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు మోడీ. వలస పాలకుల చేతిలో బానిసత్వం అనుభవించిన భారత్లో నూతన ఉత్సవాన్ని నింపిన వ్యక్తికి ఈరోజు అంకితం అని అన్నారు.

స్వామి వివేకానంద జయంతి రోజున నేను ఇలా మీ ముందు కి రావడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు యువత వ్యక్తిత్వం నిబద్ధత పై భారత ఆకాంక్షలు నిజమని ఆయన చెప్పేవారు. యువత స్వచ్ఛంద ఆలోచనల తో ముందుకు సాగితే దేశ లక్ష్యాలు నెరవేరుతాయి అని శ్రీ అరబిందో నమ్మే వారని మోడీ చెప్పారు ఇప్పుడు భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా వెలుగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news