పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న ‘నా సామిరంగ’ .. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

సంక్రాంతి బరిలోకి కాస్త లేటుగా దిగాడు కింగ్ నాగార్జున. నా సామి రంగ అంటూ తన లేటెస్ట్ సినిమాతో ఇవాళ్టి నుంచి థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్ సినిమాలు తేజ సజ్జ హనుమాన్ మూవీ దెబ్బకి ఔటయ్యాయి. మరి ఈ కింగ్ హనుమాన్ ముందు నిలబడతాడో లేదో చూడాలంటే ఇవాళ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

నాగార్జునతో పాటు ఈ మూవీలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ నటించింది. అయితే నా సామిరంగ ఓటీటీ డీల్, పార్టనర్ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను థియేటర్‌లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తారని టాక్. అంటే నా సామి రంగ వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news