జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తీసిపారాయ్..బాలకృష్ణ కామెంట్స్ !

-

సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Balayya’s comments go viral NTR flexi removal

అయితే ఫ్లెక్సీ తొలగించాలని బాలకృష్ణ చెబుతున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది. “తీయించేయ్…. వెంటనే తీయించేయ్” అని బాలయ్య బాబు చెప్పడం అందులో వినిపించింది. మరి ఆయన మాటలు ఫ్లెక్సీలను ఉద్దేశించినవేనా అనేది తెలియాల్సి ఉంది.

కాగా, నేడు సీనియర్ ఎన్టీఆర్‌ వర్ధంతి ఉన్న తరుణంలో హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ ను నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news