బడి పిల్లలకు కోడి పిల్లలు ఫ్రీ.. ఎక్క‌డంటే..?

-

బ‌డికి వెళ్లే పిల్ల‌ల‌కు కోడి పిల్ల‌లు ఫ్రీ. అబ్బో.. ఇలాంటి ప‌థ‌కం కూడా ఉందా..? ఇది ఎక్క‌డ ప్ర‌వేశ పెట్టారు..? అని అనుకుంటున్నారా..? అవునండీ..! ఇది నిజ‌మే బిడికి వెళ్లే పిల్ల‌ల‌కు కోడి పిల్ల‌ల‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కానీ.. ఇది మ‌న ద‌గ్గ‌ర కాదు. ఇండొనేసియాలోని బందంగ్ నగరంలో. దీనికి కారణం.. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో స్మార్ట్ ఫోన్ యుగం న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా.. ఎవ‌రు చూసినా చేతిలో ఫోన్ ప‌ట్టుకుని ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు.. పిల్ల‌లు అని తేడా లేకుండా అదే ప్ర‌పంచంగా బ్ర‌తుకుతున్నారు. దీంతో పిల్ల‌లు ఆరుబ‌య‌ట ఆడుకోవ‌డం మానేసి టీవీల ముందు, సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. ఈ జాఢ్యం ఎలా వదిలించాలా? అని ఆలోచించిన స్థానిక పెద్దలు ఓ కొత్త ఐడియా ఆలోచించారు.

ఈ క్ర‌మంలోనే స్కూలుకు వెళ్లే పిల్లలకు కోడి పిల్లలు ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం కోడి పిల్లలే కాదు. పచ్చి మిరప విత్తనాలు కూడా ఇస్తున్నారు. ఆ కోడి పిల్లలను పెంచడం వారి పని. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కోడి పిల్లలకు మేత వేయడం, వాటితో ఆడుకోవడం వంటి పనులు చేయడం వల్ల పిల్లలకు స్మార్ట్ ఫోన్‌కు దూరం అవుతారనే అభిప్రాయం ఉంది. దీంతోపాటు పచ్చి మిరప విత్తనాలు నాటి.. వాటికి నీళ్లు పోసి, మొక్కలు పెంచాలనే నియమం కూడా పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news