హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ కి కొత్త కాదు: కె లక్ష్మణ్

-

హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్కే కొత్త కాదంటూ లక్ష్మణ్ కామెంట్స్ చేశారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎల్లుండి రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజిలో ఏర్పాటుకు భూమి పూజ చేసి మొదలుపెట్టారు. ఎల్లుండి రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీలో బిగ్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదం వితరణ ఉంటుందని చెప్పారు.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రత్యక్షంగా చూడడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని చెప్పారు. 1885 నుండి కూడా రామ మందిరం కేసు నడుస్తోందని చెప్పారు అయోధ్యలో అనేక తవ్వకాలు జరిగిన తర్వాత చివరికి రామ మందిరం ఉందని చెప్పారు 1951 లో సోమనాథుని మండల ప్రారంభోత్సవం వ్యతిరేకించారని అన్నారు హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ కి కొత్త కాదు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news