త్యాగాల ఫలితమే రామమందిరం : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

-

ఎందరో త్యాగాల ఫలితంగానే ఇవాళ అయోధ్య రామమందిరం సాకారం అయిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. 500 ఏళ్ల తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడి కోసం కోట్లాది గళాలు స్మరించాయి. రాముడి ధర్మం, త్యాగనిరతికి ప్రతీక. సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడమే మన ధర్మం. పవిత్రతతో జీవించాలి. దానికి సంయమనం చాలా అవసరం. మందిరం కోసం మోడీ కఠిన నియమాలు పాటించారు. నవ భారత్ కి ఈ మందిరం నిదర్శనమం అని ఆయన పేర్కొన్నారు.

శ్రీరాముడి సంకల్పం అందరికీ ఆదర్శమని తెలిపారు. ఇక నుంచి చిన్న చిన్న వివాదాలపై ఘర్షణలు పడటం ఆపాలని పిలుపునిచ్చారు. రామాయణం, మహాభారతం కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తుకు చేశారు. ప్రజలందరూ సోదరభావంతో మెలగడమే బ్రహ్మసత్యం అని చెప్పారు. రాముడి నుంచి కరుణ, పరోపకారం నేర్చుకోవాలని సూచించారు. అసలు ఈ మహత్తర ఘట్టాన్ని వర్ణించడానికి తనకు మాటలు రావడం లేదని ఎమోషనల్ అయ్యారు. కష్టకాలంలో ప్రపంచానికి ఇది దిక్సూచి అన్నారు. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధాని మోడీ కఠోర దీక్ష చేపట్టారని తెలిపారు. మోడీ గొప్ప తపస్వీ అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news