మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది అవిశ్వాస తీర్మానంలో నెగ్గామని విజయోత్సవ ర్యాలీ చేస్తున్న సందర్భంగా టపాసులు కాలుస్తున్నాడు. యువకుడు సంబరాలు చేసుకుంటున్న టైంలో చెయ్యి తెగి కింద పడిపోయింది ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.
ఈ అవిశ్వాసానికి మున్సిపల్ చైర్మన్ గైర్హాజరయ్యారు. అతన్ని తొలగించే అంశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు విజయాన్ని సాధించారు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా టపాసులు కాల్చారు. ఈ యువకుడు చేతిలో రెండు టపాసులు పట్టుకుని ఉండగా కొన్ని నిప్పురవ్వలు ఎగిరి వచ్చి వాటికి అంటుకోవడం వలన పేలి పోయాయి దీంతో యువకుడు చెయ్యి వెంటనే నుజ్జు నుజ్జయ్యింది. యువకుడ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యాన్ని అందిస్తున్నారు.