ఉరవకొండ వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో సీఎం జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ అన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే.. చంద్రబాబు ను భుజాన ఎత్తుకొని మోసే ముఠా. పక్కా రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ .. పక్కా పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికే వారు.. వీళ్లదే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో కూడా కొంత మంది స్టార్ క్యాంపెయినర్లున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని కానీ.. షర్మిల పేరు కానీ పలక లేదు సీఎం జగన్.
తాత్కాలికంగా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న స్టార్ క్యాంపెయినర్లున్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలున్నట్టే.. ఇతర పార్టీల్లో కూడా రకరకాల బినామిలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో జెండాలను జత కట్టడమే వారి ఎజెండా. నాకు ఉన్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే ఎవ్వరూ లేరు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగినా ప్రతీ ఇల్లు.. ప్రతీ ఇంట్లో ఉన్న ప్రతీ అక్కా చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే అని చెప్పుకొచ్చారు జగన్. రాబోయే రోజుల్లో అబద్దాలు చెబుతారు. మోసాలు ఎక్కువగా చేస్తారు. మీ దగ్గరికి వచ్చి ప్రతీ ఇంటికి వచ్చి కేజీ బంగారం ఇస్తామంటారు. బెంజీ కారు కూడా ఇస్తామంటారు. కానీ ఆలోచన చేయమని చెబుతున్నాను. మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని కోరుతున్నాను.