కెనడా కీలక నిర్ణయం.. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి

-

ఇటీవల చెప్పినట్లుగానే విదేశీ విద్యార్థుల విషయంలో కెనడా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితి విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్ సోమవారం రోజున ప్రకటించారు. ఇప్పుడు ఇస్తున్న వాటిలో మూడో వంతు పర్మిట్లపై కోత పెట్టనున్నట్లు వెల్లడించారు.

పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందని అంచనా. 2025కు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది చివర్లో వెల్లడిస్తామని మిల్లర్ తెలిపారు. దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి వచ్చే వారందరికీ సరైన వనరులు అందివ్వకపోవడం సమంజసం కాదని తాము భావిస్తున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని మార్క్‌ మిల్లర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news