హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు

-

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఇక మంగళవారం నుంచి రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. నిన్న ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలరాముణ్ని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఎలా వెళ్లాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.

ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకూ 17 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రైళ్లు మొత్తం 41 ట్రిప్పుల్లో భక్తులను అయోధ్యకు చేర్చనున్నాయి. ఇందులో సికింద్రాబాద్‌ నుంచి ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో 17 ప్రత్యేక ట్రిప్పులున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు తోడు.. ప్రతిరోజు సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌కు ఉదయం 9.25 గంటలకు ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. మరోవైపు ప్రతి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు నగరం నుంచి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news