విశాఖ స్టీల్ కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైన సిద్ధమే : గంటా శ్రీనివాసరావు

-

విశాఖ స్టీల్ కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైన సిద్ధమేనని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఎప్పుడైతే రాజీనామా చేశానో అప్పటి నుంచి దానికి కట్టుబడి ఉన్నాను. విశాఖ ప్రజల ఆశీస్సులతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల కోసమే హడావుడిగా నా రాజీనామా ఆమోదం చేశారు. ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేదు. కనీసం నా విచారణ తీసుకోకుండానే రాజీనామా ఆమోదం తెలిపారు.

విశాఖ స్టీల్ కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైన సిద్ధమే అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విలువలకు ఎలా తిలోదకాలు ఇస్తున్నాడో ప్రజలు చూస్తున్నారు. జగన్ కి దమ్ము, ధైర్యం ఉంటే పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయగలడా..? అని ప్రశ్నించారు. జగన్ తీరుతోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లిపోతున్నారని తెలిపారు. సీఎం జగన్ చిత్తశుద్ధిలో పని చేస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కసారి కూడా కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు అని నిలదీశారు. 

Read more RELATED
Recommended to you

Latest news