కౌశిక్‌రెడ్డి ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ !

-

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళ సై సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి అన్నారు… అలాంటి వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఫైర్‌ అయ్యారు. ఓటర్లను ఇలా బలవంతం చేయకూడదని కోరారు. ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమేనని విహార యాత్రలు వెళ్లేందుకు కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

Governor Tamilisai is serious about Kaushik Reddy’s campaign

సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని తెలిపారు. 90 నుంచి 95 శాతం ఓటింగ్ జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని వసతులు కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో సీఈవో వికాస్‌ రాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ… ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news