కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది పార్లమెంట్ ఎన్నికల ముందు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి బాగా షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బిజెపిలోకి కలిసి పోయారు ఈరోజు ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం పార్టీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో బిజెపి లోకి తిరిగి చేరారు ఆయనకి ఆడ్యూరప్ప బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఇన్వైట్ చేశారు. ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి ఎన్నికల్లో కల్పించలేదని అనుమానంతోనే బిజెపిని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు.
కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు రాలేదు అందుకనే మళ్ళీ తిరిగి బీజేపీలో చేరారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వర్గానికి చెందిన ఓట్ల వల్లనే కాంగ్రెస్ పార్టీలో పలు నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అయిన బీజేపీ పార్టీలో చేరడంతో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.