ఇకపై వాట్సప్‌లోనే మెట్రో టికెట్స్‌ కొనవచ్చు.!

-

పోటీ ప్రపంచంలో మనం ముందు ఉండాలంటే.. కొత్తగా ఏదో ఒకటి చేయాలి. అందరి దగ్గర ఉన్నవే మన దగ్గర ఉంటే.. జనాలకు మనం కొత్తగా కనపడం. పని తేలిగ్గా అవ్వాలి అప్పుడే మార్కెట్‌లో మన బ్రాండ్‌ పేరు మారుమోగిపోతుంది. వాట్సప్‌ ఇలానే అనుకుంటుంది.. పాపం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌ తీసుకొస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా స్టేటస్‌ వ్యూ ఆప్షన్‌ మారింది. ఇంతకు ముందు ఒక దాని కింద ఒకటి ఉండేవి.. ఇప్పుడు ఇన్‌స్టాలో స్టోరీలా పక్కన ఉంటున్నాయి. ఇప్పుడు మొట్రో టికెట్స్‌ బుకింగ్స్‌ కోసం ఎక్కడికో ఎందుకు.. నా దగ్గరే చేసుకోండి అని వాట్సప్‌లోనే ఆ సుదపాయాన్ని తీసుకొచ్చింది.

వాట్సాప్​ ఆధారిత క్యూఆర్​ కోడ్​ టికెటింగ్​ సర్వీస్​ అందుబాటులోకి రావడంతో మెట్రో స్టేషన్స్​లో టోకెన్స్​ తీసుకునే పని తప్పుతుంది. అయితే.. ఈ సేవలు ప్రస్తుతం చెన్నై మెట్రోకే అందుబాటులోకి వచ్చాయి. కోయంబెడు, ఎయిర్​పోర్ట్​ మెట్రో స్టేషన్స్​లో వీటిని తొలుత ప్రవేశపెట్టారు. అనంతరం చెన్నైలోని 41 మెట్రో స్టేషన్స్​లో వాట్సాప్​ ఆధారిత క్యూఆర్​ కోడ్​ టికెటింగ్​ సిస్టెమ్​ యాక్టివేట్​ అయ్యింది. ప్రయాణికుల నుంచి దీనికి మంచి రెస్పాన్స్​ లభిస్తోంది.

వాట్సాప్​లో మెట్రో సేవలు..

వాట్సాప్​లో మెట్రో టికెట్ల్​ కోసం.. ముందు కౌంటర్​కి వెళ్లాలి. మీ ఫోన్​ నెంబర్​ ఇవ్వాలి. మీ గమ్యస్థానాన్ని చెప్పాలి. ఎన్ని టికెట్స్​ కావాలో చెప్పాలి. కంప్యూటర్​కి కనెక్ట్​ అయిన కీప్యాడ్​లో ఫోన్​ నెంబర్​ టైప్​ చేయాలి. ఓ క్యూఆర్​ కోడ్​ మీ వాట్సాప్​ నెంబర్​కి వస్తుంది. అక్కడే.. పేమెంట్​ ఆప్షన్​ ఉంటుంది. క్యాష్​, కార్డ్​, యూపీఐ ద్వారా పేమెంట్​ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా సెక్యూర్​ కూడా. పైగా.. మొబైల్​ నెంబర్స్​ని సర్వర్​లో సేవ్​ చేసుకోమని చెన్నై మెట్రో చెబుతోంది. ఫలితంగా.. ప్యాసింజర్ల డేటా ప్రైవసీ

“తరచూ కాకుండా అప్పుడప్పుడు మెట్రోలో ప్రయాణించే వారికి ఈ వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలు ఉపయోగపడతాయి,” అని సీఎంఆర్​ఎల్​ ఎండీ ఎం.ఏ సిదిఖి అభిప్రాయపడ్డారు. పేపర్​ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితంగా మెట్రోను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది చెన్నై మెట్రో. ఈ వాట్సాప్​ టికెటింగ్​ సర్వీస్​తో మరో ముందడుగు వేసినట్టు చెప్పుకొచ్చింది. వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలతో.. ప్రతి నెల 4 టన్నుల పేపర్​ వాడకం తగ్గుతుందని చెప్పింది. ఖర్చులు కూడా దిగొస్తాయని స్పష్టం చేసింది. వాస్తవానికి.. పేపర్​ క్యూఆర్​ టికెట్స్​ని చెన్నై మెట్రో దాదాపు రద్దు చేసింది. టోకెన్స్​ని కూడా అత్యవసరమైతే తప్ప ఇవ్వట్లేదు.

త్వరలో ఇది హైదరాబాద్‌, ఢిల్లీ మెట్రోలకు కూడా విస్తరిస్తుందేమో..! అయితే వాట్సప్‌ నుంచే టికెట్‌ తీసుకోవడం అంటే బెటర్‌.. మళ్లీ కౌంటర్‌కు వెళ్లి, క్యూలో నిలబడి వాళ్లకు మన ఫోన్‌ నెంబర్‌ చెప్పి ఇదంతా టైమ్‌ వేస్ట్‌ ప్రాసెస్‌. ఈరోజుల్లో యువత అంత టైమ్‌ను అక్కడ అస్సలు వేస్ట్‌ చేయరు..పేటీఎం, ఫోన్‌పేలోనే మెట్లు ఎక్కేలోపు టికెట్‌ తీసుకోవచ్చు.. కౌంటర్‌లో క్యూ లైన్‌లో నిలబడే అవసరం లేకుండా.! మీరేమంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news