అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే : జెలెన్ స్కీ

-

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు, సామాన్యులు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. అయితే తాజాగా రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో జరుగుతున్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతిస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని జెలెన్స్కీ అన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే అది ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. జర్మనీ పర్యటనలో ఉన్న జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

“జర్మనీ నుంచి టారస్‌ క్రూజ్‌ క్షిపణలు అందకపోవటంపై నేను పెద్దగా నిరాశ చెందలేదు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాల బలహీనతలను అర్థం చేసుకోగలను. ఉక్రెయిన్‌ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఇప్పుడు జర్మనీ పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలి.” అని జెలెన్స్కీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news