రెండు చోట్ల పోటీ చేసే ఆలోచనలో టిడిపి అధినేత చంద్రబాబు.. పార్టీ క్యాడర్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే..??

-

వై నాట్ 175 అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పై దృష్టి పెట్టింది.. చంద్రబాబు నాయుడు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.. కరువుతో అల్లాడుతున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా వాటర్ తీసుకొస్తానంటూ చంద్రబాబు గతంలో అనేకమార్లు చెప్పారు.. అయితే అవి కార్యరూపం దాల్చలేదు.. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చారు.. ఈ ఒక్క హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ను పెంచిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో సైతం చంద్రబాబుకి గడ్డుకాలం కనిపిస్తోందట. దీంతో ఇటీవల తెలుగుదేశం పార్టీ ఓ సర్వే చేయించిందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం నడుస్తుంది.. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేల్లో తేలిందట. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగోలేదని.. చంద్రబాబు కూడా ఎడ్జ్ లో ఉన్నారని సర్వేలు తేటతెల్లం చేయడంతో ఆయన ఇటీవల కుప్పం నియోజకవర్గములో పర్యటించారట.. పార్టీ క్యాడర్ తో ముఖ్య నేతలతో ఆయన సమాలోచనలు జరిపి పార్టీ పరిస్థితిని అంచనా వేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు..

2024 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై ముఖ్య నేతలతో సమీక్షలు జరిపారట.. దీనిపై పలువురు నేతలు కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందనే మెజార్టీ నేతలు చంద్రబాబుకి చెప్పారట.. దింతో బాబు కుడా మరో నియోజకవర్గంలో పోటీ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారాని చంద్రబాబు అంతరంగికులు చెబుతున్నారు.. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు మరో నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటున్నారని వైసీపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు.. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని.. కుప్పం కూడా ఈసారి వైసీపీ కైవసం చేసుకోబోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు.. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news