మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మేకలు,గొర్రెలు, పశువుల కబేళాలు, రిటైల్ మాంసం, గొడ్డు మాంసం షాప్ లను జనవరి 30న మూసివేయనున్నారు.ఈ క్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చే మూడు పోలీసు కమిషనరేట్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.