భూమా అఖిల ప్రియకి చెక్ పెడుతున్న సొంత కుటుంబ సభ్యులు.. ఇది బాబు పనేనా..??

-

నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు ఒకటవుతున్నారు.. వచ్చే ఎన్నికలలో భూమా అఖిలప్రియ కు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అఖిలప్రియ కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ ఏంటో చూడండి..

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో భూమా కుటుంబంలో వారసత్వ పంచాయితీ మొదలైంది. ఆళ్లగడ్డ బిజెపి ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి అఖిల ప్రియకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులను ఏకం చేస్తున్నారు.. భూమా కుటుంబ వారసత్వం తనకే వస్తుందని.. ప్రెస్ మీట్ పెట్టి మరీ అఖిలప్రియ పై దుమ్మెత్తి పోసారట.. అఖిల ప్రియ భూమా కుటుంబ పరువు తీసేస్తోందని కిషోర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది..పొత్తులో భాగంగా బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయిన పోటీ చేస్తానని అయన హెచ్చరించారు.

భూమా నాగిరెడ్డి రాజకీయ వారసత్వంతో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తుంది.. వైసీపీలో ఉన్నామే అనంతరం టిడిపిలో చేరి ఎన్నికల్లో పోటీ చేసింది. ఓటమిపాలైన తరువాత ఇన్చార్జిగా నియోజకవర్గంలో తిరుగుతుంది. ఏవి సుబ్బారెడ్డి వర్గంతో ఆమె గొడవలోకి ఘర్షణలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఈసారి అఖిలప్రియకు టిక్కెట్ డౌటే అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె కుటుంబంలోనే పంచాయతీ స్టార్ట్ అయింది.. బిజెపి ఇన్చార్జిగా ఉన్న భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియ ఆగడాలపై తీవ్రమైన విమర్శలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు వ్యతిరేకంగా పనిచేస్తానని.. టిక్కెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్డిగా బరిలో ఉంటానని కిషోర్ రెడ్డి చెబుతున్నారట.. ఈ వ్యవహారంపై అఖిలప్రియ ఎక్కడా పబ్లిక్ గా మాట్లాడిన సందర్భాలు లేకపోయినప్పటికీ.. కుటుంబ వ్యవహారం ఆమెకి తలనొప్పిగా మారిందని ఆళ్లగడ్డలో టాక్ నడుస్తుంది.. భూమా కుటుంబంలో టిడిపి అధినేత చంద్రబాబే చిచ్చు పెట్టారని అఖిల ప్రియ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.. వారసత్వ పంచాయితీని అఖిలప్రియ ఎలా చేదిస్తారో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Latest news