తను చాలా సపోర్ట్ చేశాడు.. విజయ్ పై రష్మిక మనసులో మాట

-

యానిమల్ మూవీ సక్సెస్ జోష్లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన కోస్టార్స్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, సిద్ధార్థ్‌ మల్హోత్ర గురించి రష్మిక మాట్లాడింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను చేసే ప్రతి పనిలో తన సహకారం ఎప్పుడూ ఉంటుంది. అతని సలహా తీసుకుంటా. అది నాకు అవసరం. ఏది మంచో, ఏది చెడో వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్‌ చేశారు’’ అని చెప్పుకొచ్చింది.

ఇక అమితాబ్‌ బచ్చన్ గురించి మాట్లాడుతూ.. ‘సర్‌.. వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు.’ అని చెప్పింది. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణ్‌బీర్‌ ఇచ్చారని తెలిపింది. ఇక విజయ్‌-రష్మిక గతంలో రెండు సినిమాల్లో (గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌) కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహార యాత్రలకు, పార్టీలకు వెళ్లడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news