చేతి కర్ర సహాయంతో అసెంబ్లీకి కేసీఆర్..వీడియో వైరల్

-

బీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌, గజ్వేల్‌ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. చేతి కర్ర సహాయంతో నడుచుకుంటూ లోపలికి స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు కేసీఆర్.

ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీరు చెప్పేది కొండంత చేసేది గోరంత కూడా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్‌లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేసి ఊహించినట్లు గానే తామే నియామకాలు చేసినట్లు డబ్బా కొట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని ఎన్నికల ప్రచారంలో కల్లిబొల్లి మాటలు చెప్పిన రేవంత్ …బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news