ఆమె పేరు ఎత్తే అర్హత నీకు లేదు.. రష్మిక పై ట్రోల్స్..!

-

రష్మిక మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రష్మిక తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది తన యాక్టింగ్ తో అందంతో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక కుర్రాళ్ళ క్రష్ గా పేరు తెచ్చుకుని ఈ భామ భాషతో కూడా సంబంధం లేకుండా వరుస మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఒక ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొన్నారు.

నా చిన్నతనంలో నేను సౌందర్య లా ఉన్నానని మా నాన్న అనేవారు నాకు అవకాశం వస్తే సౌందర్య బయోపిక్ లో నటిస్తాను అని చెప్పింది. దీంతో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది సౌందర్య కాదు సౌందర్య గారు అనాలి. అసలు సౌందర్య పేరు ఎత్తే అర్హత నీకు లేదు అని ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఆమె బయోపిక్ లో నటించడం ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు రష్మిక మరి ఇటువంటి కామెంట్స్ మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news