ప్రధాని కావాల్సిన అద్వానీకి భారత రత్న ఇచ్చి పరువు తీశారని బీజేపీ ప్రభుత్వంపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్వానీ ప్రధాని అవుతారు అనుకున్నాను…భారతరత్న అంటే టోల్గేట్ దగ్గర టోల్ కండక్టర్ అన్నారు. భారతరత్న ప్రకటించడం వల్ల ఆయనకు తిరిగి అదరపు గౌరవం ఏమీ ఉండదని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించాల్సిన 42% నిధులను 32 శాతానికి తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందని ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో ఉన్న కేసులను తెలంగాణ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయమని రామోజీరావు వేసిన కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉన్న కేసులు ఇక్కడే విచారించాలని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదని తేల్చిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేసులు పెట్టడానికి అవకాశం ఏర్పడిందన్నారు.
మార్గదర్శకులు మొత్తం అన్ని తప్పులే అనే నిరూపించే ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీల్లో ఎందుకు ఉండకూడదని నిలదీశారు. 40 శాతం కన్నా ఎక్కువ లబ్ధిదారులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు… చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు అయిపోతాయి అన్న విషయం ప్రజలకు తెలుసు అని సెటైర్లు పేల్చారు ఉండవల్లి.