కేజ్రీవాల్ కు షాక్.. కోర్టును ఆశ్రయించిన ఈడీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ అధికారులు ఐదుసార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా ఆ సమన్లకు స్పందిచలేదు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌పై దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. అరవింద్ కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

ఈ కేసులో సీబీఐ అధికారులు దిల్లీ ముఖ్యమంత్రి అరవిద్ కేజ్రీవాల్​ను ఇప్పటికే విచారించారు. 2023 ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించగా.. ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు ఐదుసార్లు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబరు 2వ తేదీ, డిసెంబరు 21వ తేదీ, ఈ ఏడాది జనవరి 3వ తేదీ, జనవరి 18, ఫిబ్రవరి 2వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news