హెచ్‌ఎండీఏ బాలకృష్ణ ఉదంతం బీఆర్ఎస్ లంచాలకు ఉదాహరణ: మంత్రి కోమటిరెడ్డి

-

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. నాణ్యత లేని పనుల వల్ల మేడిగడ్డ మూడేళ్లకే కూలిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కట్టిన నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో ఒక్క పగులు కూడా లేదని చెప్పారు.

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అనే అధికారి ఉదంతం బీఆర్ఎస్ లంచాలకు ఉదాహరణ అని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బాలకృష్ణ అనే ఆర్డీవో క్యాడర్‌ అధికారి రూ.1000 కోట్లతో దొరికాడని తెలిపారు. మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌కు 5 వేల ఎకరాలు ఉన్నాయని.. అతడి బండారం త్వరలో బయటకు వస్తుందని అన్నారు. కేసీఆర్ ఇంకా ప్రైవేటు విమానం లీజ్‌ క్యాన్సిల్‌ చేసుకోలేదని.. కుటుంబంతో దుబాయ్‌కు పారిపోవచ్చనే లీజు కొనసాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.కీలక శాఖలన్నీ తనవద్ద పెట్టుకుని కేసీఆర్‌ దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు బ్రాంచ్‌కెనాల్‌ ద్వారా నీరు ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news