చంద్రబాబు హయాంలో దోచుకో పంచుకో అన్నట్టు జరిగిందని.. కానీ మన ప్రభుత్వంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడారు. కనీసం ప్రత్యేక హోదాకు చట్టం కూడా చేయలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి తీవ్ర నష్టం జరిగింది.
రాష్ట్ర విభజన తరువాత ప్రతీ ఏడాదికి ఏపీకి రూ.13వేల కోట్ల నష్టం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీకి తక్కువ ఆదాయం వస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం. అందుకే విశాఖపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం మనకు ఆదాయం తక్కువగా వస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా ఎండమావిగా కనిపిస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తి స్థాయి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నాను. అప్పుడే ఏపీకి న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకుంటారని వెల్లడించారు.