తిరుమల శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం

-

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,345 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. హుండీకి నిన్నటి ఆదాయం రూ. 3.71 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

కాగా, ఇక నుంచి భక్తులు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి పొందేందకు వీలుగా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన భక్తులకు టికెట్లు జారీ కాగానే నేరుగా వారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ లింక్‌ పంపుతున్నారు. భక్తులు దానిపై క్లిక్‌ చేసి పేమెంట్‌ గేట్‌వే ద్వారా నగదు చెల్లిస్తే బ్రేక్‌ దర్శన టికెట్‌ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలా అనంతరం టికెట్‌ను ప్రింట్‌ తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news