ఆంధ్ర వ్యక్తులను నియమిస్తే తప్పేంటి అంటూ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్రకు చెందిన రజినీకాంత్ రెడ్డిని నియమిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బాధ ఐతుందని ఫైర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున హైకోర్టులో 2,200 కేసులు వాదించారన్నారు మంత్రి కొండా సురేఖ.
అలాంటి వ్యక్తులను నియమిస్తే తప్పేంటి అంటూ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…ఆటో కార్మికులకు శుభవార్త చెప్పారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. వారికి ఏటా రూ.12వేలు సాయం చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో వారికి కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనతో అసెంబ్లీలో ఆ సమస్యపై చర్చ ముగిసినట్టైంది.