హెచ్‌ఎండీ మాజీ డైరెక్టర్, రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఆయణ్ను ఏసీబీ అధికారులు 8 రోజల పాటు కస్టడీ తీసుకోని విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో శివబాలకృష్ణ ఓ ఐఏఎస్ అధికారి పేరును ప్రస్తావించినట్లు సమాచారం. సదరు అధికారి తన నుంచి భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారని ఏసీబీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.
నార్సింగిలోని వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ అడ్డగోలు అనుమతులు ఇచ్చారని అధికారులు గుర్తించారు. ఐఏఎస్ అధికారి ఆదేశాలతోనే భూమికి క్లియరెన్స్ ఇచ్చిన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. నార్సింగిలోని ఓ ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్ 10 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు శివ బాలకృష్ణ తెలిపాడట. డిమాండ్ చేసిన 10 కోట్లలో కోటి రూపాయలు చెల్లింపులు జరిగాయని అధికారులు గుర్తించారు. బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో తెలిపిన విషయాల ఆధారంగా ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.