ప్రాణాలు పోయినా కేసీఆర్‌ తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయరు: హరీశ్‌రావు

-

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం సత్య దూరమైన ప్రజంటేషన్‌ ఇచ్చిందని ఆరోపించారు. పీపీటీ కోసం తమకూ అవకాశమివ్వాలని కోరామని.. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశమివ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రాజెక్టులు అప్పగించవద్దన్న తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.

“బీఆర్ఎస్‌పై బురద జల్లేందుకు ఉత్తమ్‌ చూస్తున్నారు. పోతిరెడ్డిపాడు కోసం పేగులు తెగేదాక కొట్లాడింది బీఆర్ఎస్‌ పార్టీయే. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం.. పెదవులు మూసుకున్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చాం. రాష్ట్ర ఏర్పడిన ఒక నెలలోనే కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రానికి లేఖ పెట్టాం. ఒకటిన్నర సంవత్సరం అయినా కేంద్రం స్పందించకుంటే మేం సుప్రీంకోర్టుకు వెళ్లాం. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రానికి 35 నుంచి 40 లేఖలు రాశాం. బీఆర్ఎస్ పోరాటం వల్లే కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యూనల్‌ ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ ప్రాణాలు పోయినా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయరు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకెళ్లేందుకు ఏపీకి అనుమతించారు. బీఆర్ఎస్ నల్గొండ సభ కారణంగానే ఇప్పుడు తీర్మానం పెట్టారు. ప్రాజెక్టుల అప్పగింతపై కేసీఆర్‌ గొంతువిప్పాకే సర్కారు స్పందించింది.” అని హరీశ్‌రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news