అచ్చెన్నాయుడు: మూడు రాజధానులు పేరుతో చిచ్చు పెట్టారు..!

-

మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారు మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. హైదరాబాద్ పేరుతో నాలుగవ ముక్క తెర మీదకి తీసుకువచ్చారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు వైవి సుబ్బారెడ్డి నోట జగన్ రెడ్డి మాట బినామీ ఆస్తులు కాపాడుకోవడానికి వైవి నోటా 10 హైదరాబాద్ పాట అని ఆరోపణలు చేసారు.

విశాఖలో జగన్మోహన్ రెడ్డి 40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు అందుకే ఇప్పుడు దాకా విశాఖే రాజధాని అని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకం తెరలేపుతున్నారు అని అన్నారు గతంలో అమరావతికి 30 వేల ఎకరాలు ఉండాలని అన్నారు ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నానని జగన్ అన్నారు. అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశాడని అచ్చెన్నాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news